అనంతపురంలో కురిసిన భారీ వర్షానికి పండమేరు ఉగ్రరూపం దాల్చింది. కనగానపల్లి చెరువు కట్ట తెగిపోవడంతో పండమేరు వాగుకు వరద పోటెత్తింది. వరద ఉధృతికి పలు కాలనీలు నీటమునిగాయి. వరద నీరు ఇళ్లల్లోకి చేరగా.. బైకులు, ఆటోలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. బాధితుల్ని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరోవైపు శ్రీసత్యసాయి జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగడంతో హైదరాబాద్-బెంగళూరు రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.