కారేపల్లి: అర్హులకే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి

73பார்த்தது
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఆవుల అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కారేపల్లిలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ కమిటీల్లో కేవలం అధికార పార్టీ నేతలనే కాకుండా అఖిలపక్ష పార్టీల నేతలను కూడా నియమించాలని సూచించారు. నిరుపేదలకు మాత్రమే ప్రభుత్వ పథకాలను వర్తింపచేయాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி