కారేపల్లి గ్రామపంచాయతీలో మెయిన్ రోడ్ నందు డ్రైనేజ్ కాలువ దాటి అక్రమ కట్టడాలు కొనసాగుతున్నాయి. గత ఎంపీడీవో, ఆర్ అండ్ బి శాఖ అక్రమ కట్టడాలు కూల్చివేయగా మరల డ్రైనేజ్ కాలువలు దాటి యదేచ్ఛగా పట్టపగలే అక్రమ కట్టడాలు కొనసాగుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని పలువురు గ్రామస్తులు వాపోతున్నారు. అక్రమ కట్టడాలను తొలగించాలని అధికారులను వేడుకుంటున్నారు.