బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని హెచ్ఎం ను నిర్బంధించిన ఘటన వైరా మండలంలోని పాలడుగు గ్రామంలో జరిగింది. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం చావా శ్రీనివాసరావు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపించారు. హెచ్ఎంను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఈఓ వెంకటేశ్వర్లును గదిలో నిర్బంధించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.