కొత్తగూడెంలో ఈనెల 21, 22, 23 తేదీల్లో నిర్వహించే ఐద్వా రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా నాయకురాలు గుడిమెట్ల రజిత కోరారు. ఆదివారం వైరా పరిధిలోని సుందరయ్యనగర్, హనుమాన్ బజార్, బ్రహ్మణపల్లి, సోమవరం గ్రామాల్లో ఇంటింటికీ మహసభల వాల్ పోస్టర్లు వేస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు. సనాతన ధర్మం పేరుతో మహిళలను వంటింటికే పరిమితం చేయాలనే బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా ఐద్వా నిరంతరం పోరాడుతుందన్నారు.