కారేపల్లి బీజేపీ పాలనలో మహిళలపై అఘాయిత్యాలు అణచివేత ధోరణి విపరీతంగా పెరిగిందని ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి విమర్శించారు. మంగళవారం కారేపల్లి మండల ఐద్వా మహాసభ మాణిక్యారంలో సూరబార ధనమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సభలో మాచర్ల భారతి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తాచాటుతున్న పాలకులు మాత్రం తమ పురుషాధిక్యతను ప్రదర్శిస్తూ అనేక రూపాలలో వివక్షత చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.