AP: గుడివాడలో వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. మంగళవారం కొడాలి నాని పుట్టిన రోజు. ఈ సందర్భంగా కొడాలి నాని అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. ర్యాలీలు, నడిరోడ్డుపై వేడుకలు చేయవద్దంటూ వైసీపీ నేతలకు పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. దాంటో గుడివాడలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.