వైరా మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాసనాయక్ సూచించారు. ఆదివారం వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్ అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ సమావేశంలో ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. వైరా మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి దాదాపు రూ. 100 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.