సబ్బితం జలపాతం వెళ్లే రోడ్డుకు మరమ్మతులు

64பார்த்தது
సబ్బితం జలపాతం వెళ్లే రోడ్డుకు మరమ్మతులు
పెద్దపల్లి మండలం సబ్బితం నుండి జలపాతానికి వెళ్లే రోడ్డు మరమ్మతు పనులు బుధవారం చేపట్టారు. రోడ్డు శిధిలావస్థకు చేరడంతో జలపాత సందర్శనకు వెళ్లే పర్యాటకులు, సాగు పనులకు వెళ్లే రైతులు తీవ్రఇబ్బందులు పడ్డారు. గ్రామ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, స్పందించి గతంలో జలపాతాన్ని సందర్శించి పర్యాటక కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. తక్షణ చర్యల్లో మట్టి రోడ్డు మరమ్మతుకు రూ. 5లక్షలు కేటాయించారు.

தொடர்புடைய செய்தி