
పెద్దపల్లి: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. శనివారం సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 130వ సర్వసభ్య సమావేశం ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ లో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. మండలంలో ఐదు సహకార సంఘాలు ఉన్నాయని, రైతులకు ఎరువులు, యూరియాతోపాటు ఇతర సేవలందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్ పాల్గొన్నారు.