మసీద్ ఉస్మానియాలో శుక్రవారం వక్ఫ్ బోర్డు బిల్లుకు నిరసనగా ముస్లింలు ఆందోళన చేపట్టారు. నమాజ్ అనంతరం ముస్లింలు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన చేపట్టారు. ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు వ్యతిరేక బిల్లును ఏ ముస్లిం సమర్థించబోరని ముస్లిం నేత మాజీ జడ్పీటీసీ షేక్ గయాజోద్దీన్ అన్నారు. కేంద్రం వెంటనే వక్ఫ్ బోర్డు బిల్లును ఉపసంహారించుకోవాలని డిమాండ్ చేసారు. ఈ ఆందోళనలో ముస్లింలు పాల్గొన్నారు.