పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం జుక్కల్ తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు. తెలంగాణ రాష్ట్రంలో 6500 కోట్లు పెండింగ్ ఫీజు రీయాంబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ర్యాలీగా వచ్చి ముట్టడించారు. ఈ ఆందోళనలో ఎస్ఎఫ్ఐ, బివిఎఫ్, విద్యార్థి నాయకులు, విద్యార్థులు కలిసి తహశీల్ధార్ కు వినతి పత్రం సమర్పించారు.