మద్నూర్ ఇండియన్ ఆర్మీకి ఎంపికై శిక్షణ పూర్తి చేసుకుని కాశ్మీర్ లో పారా ఎస్ ఎఫ్ కమాండో ఉద్యోగం చేస్తున్న కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బి రమేష్ కు గ్రామస్తులు సోమవారం శాలువాతో ఘన సన్మానం చేశారు. దేశానికి సేవ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంగమేశ్వర్, ప్రకాష్, సంతోష్ పటేల్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.