నిజామాబాద్-కామారెడ్డి జిల్లాల రైతాంగానికి వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టులోకి శుక్రవారం ఉదయం 24, 000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా, 1404. 96 అడుగులు మెయింటైన్ చేస్తూ 22, 500 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు 3 గేట్ల ద్వారా దిగువ మంజీర నదిలోకి విడుదల చేస్తున్నారు. 1500 క్యూసెక్కుల నీరు ప్రధాన కాల్వ ద్వారా విడుదల చేశారు.