బాన్సువాడలో దుర్గమ్మ బోనాల పండుగ గ్రామ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ బోనాలు పాత బాన్సువాడ గ్రామ చావిడి నుండి మొదలై సంగమేశ్వర కాలనీలో దుర్గమ్మ ఆలయం వరకు ఊరేగింపు కోనసాగింది. ఈ ఊరేగింపులో పోచారం శ్రీనివాస్ రెడ్డి బోనం ఎత్తుకొని అమ్మ వారికి సమర్పించారు. ఈ బోనాలు అన్ని కులాల వారు ఇంటికొక్క బోనం తీశారు. వర్షాలు సంవృ ద్ధిగా పడి పంటలు బాగా పండలాని మొక్కులు మొక్కుకున్నారు.