
బాన్సువాడ: సన్న బియ్యంతో సహా పంక్తి భోజనం
బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో గురువారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్త ఇంట్లో సన్నబియ్యంతో సహా పంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పత్తి రాము తదితరులు పాల్గొన్నారు.