కామారెడ్డి జిల్లా జూనియర్ కళాశాలలకు ఈనెల 6 నుంచి 13 వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు ప్రైవేట్ కళాశాలలకు సెలవులు వర్తిస్తాయని ఆయన తెలిపారు. సెలవు దినాలలో ప్రైవేట్ కళాశాలలో తరగతులు నిర్వహిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన సూచించారు.