బాన్సువాడ పట్టణంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ జంగల్ గంగాధర్ శనివారం ప్రారంభించారు. పట్టణంలోని రుక్మిణి దంతశాల వైద్యుడు అచుకట్ల జీవన్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు. 150 మంది విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ పిల్లలకు దంత సమస్యలు మొదట్లోనే తెలుసుకోవడం మంచిదని ఇటువంటి పరీక్షలు పాఠశాలలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు.