గంగాధర మండల కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం మరమ్మత్తు పనులను బుధవారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజాసమస్యల పైన నా చివరి శ్వాస వరకు ప్రజలతోనే ప్రయాణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యం, మండల కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఉన్నారు.