సీతాఫల్మండి పరిధి శ్రీనివాసనగర్ ఫ్రైడే మార్కెట్లో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్ లేకపోవడంతో ప్రమాదకరంగా మారింది. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఈ రహదారి పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు స్పందించాలని, చుట్టూ ఫెన్సింగ్ నిర్మించాలని కోరుతున్నారు.