కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లో కార్యాలయంలో నకిలీ డాక్యుమెంట్ తో ఖాళీ స్థలాలను విక్రయిస్తున్న ముఠాను జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాండుకు తరలించారు. జీడిమెట్ల పియస్ సుభాష్ నగర్ లో స్థల యజమాని సురేష్ కు తెలియకుండ పేక్ డెత్ సర్టిఫికెట్ తో 147 ప్లాట్ 200 గజాల స్థలం విక్రయించారు. ఆరుగురిని రిమాండుకు తరలిస్తున్నామని మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు బాలవగర్ డిసిపి సురేష్ కుమార్ తెలిపారు.