వాటర్ లైన్ మరమ్మత్తు పనులను పరిశీలించిన కార్పొరేటర్

65பார்த்தது
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిస్కరిస్తున్నామని వినాయక్ నగర్ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని కాకతీయ నగర్లో కొనసాగుతున్న వాటర్ లైన్ మరమ్మత్తు పనులను కార్పొరేటర్ పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు మురుగు నీరు సరఫరా అవుతోందని ఫిర్యాదుల మేరకు ఈ పనులను చేపట్టినట్లు తెలిపారు. త్వరగా పనులను పూర్తి చేసి యథాతధంగా మంచి నీటిని సరఫరా చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி