మంత్రి కొండా సురేఖ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు పిర్యాదు చేశారు. బంజారాహిల్స్ ఏసిపి వెంకట్ రెడ్డి, సీఐ రాఘవేందర్ లకు కంప్లైంట్లు అందజేశారు. మంత్రి కొండా సురేఖ బుధవారం తమ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఈ మేరకు ఫిర్యాదు చేసినట్లు కార్పొరేటర్లు తెలిపారు. కొండా సురేఖ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.