రంగారెడ్డి: మణికొండ మున్సిపల్ డీఈ దివ్య జ్యోతి పై భర్త ఆరోపణలు
మణికొండ మున్సిపల్ డీఈ దివ్య జ్యోతి పై ఆమె భర్త ప్రతిరోజు లంచం తీసుకురానిదే ఇంటికి రాదని బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. తను తీసుకొచ్చిన లంచానికి ఇవే సాక్షాలు అంటూ ఇంట్లో కొన్ని వీడియోలు విడుదలచేశారు. ఇంట్లో ప్రతిచోట కట్టల కట్టల డబ్బులు చూపిస్తూ 20 నుండి 30 లక్షలు తీసుకొస్తుందని అన్నారు. పెద్ద ఎత్తున మణికొండలో కాంట్రాక్టర్ ల నుంచి కమిషన్ ను తీసుకుంటుందన్నారు.