మహబూబ్ నగర్: సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులసమ్మెకు ఎంపి సంఘీభావం

58பார்த்தது
మహబూబ్ నగర్: సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులసమ్మెకు ఎంపి సంఘీభావం
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద గత 14 రోజులుగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం ధర్నా చేస్తున్న సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని ఎంపీ డీకే అరుణ సోమవారం సందర్శించి ఎస్ఎస్ఏ ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపి అరుణ అందజేశారు. ఎంపీ అరుణను ఎస్ఎస్ఏ ఉద్యోగులు మీ వంతుగా మా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி