
దేవరకద్ర: నేడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పర్యటన
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 12: 30 గంటలకు దేవరకద్రలో పర్యటించనున్నారు. అనంతరం సాయంత్రం 6: 30 గంటలకు కౌకుంట్ల మండల కేంద్రంలో సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు షేక్ అబ్దుల్ జహంగీర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని మండల బీఆర్ఎస్ అధ్యక్షులు కేబీఆర్ గౌడ్ తెలిపారు.