
కాగజ్నగర్: అంబేద్కర్ కు వినతిపత్రం ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కాగజ్నగర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం వినతిపత్రం ఇచ్చారు. లగచర్ల రైతు హీర్యా నాయక్ కు గుండెపోటు వస్తే అంబులెన్స్ కు బదులు పోలీస్ వాహనంలో చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లడం దుర్మార్గమన్నారు. రైతుల చేతులకు బేడీలు వేసిన రాక్షస ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శించారు. ఆయనతో నాయకులు శ్యామ్ రావు, నక్క మనోహర్, తదితరులు ఉన్నారు.