కాగజ్‌నగర్ మార్కెట్లో టమాటా ధరలు విపరీతంగా పెరిగాయి. శుక్రవారం ఉదయం కిలో టమాట ధర రూ. 120 పలికింది. దీంతో టమాటను ముట్టుకోవాలన్నా ప్రజలు భయపడుతున్నారు. రెండు రోజుల క్రితం కిలో ధర గరిష్ఠంగా రూ. 90 పలికింది. ఒకేసారి టమాట ధరలు పెరగడంతో ప్రజలు 'ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టులేదని అనుకుంటున్నారు. మరికొన్ని రోజులలో రెండు వందలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని వ్యాపారస్తులు అంటున్నారు.