లక్షేట్టిపేట: చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి అసదుల్లా షరీఫ్ అన్నారు. గురువారం లక్షేట్టిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు చదువుతోపాటు చట్టాలు, విద్యా హక్కులు వాటి ఉపయోగాలు తెలుసుకోవాలని అన్నారు. విద్యాహక్కు ప్రతి విద్యార్థికి ఉంటుందని అందరూ అవగాహన చేసుకోవాలని తెలిపారు.