మందమర్రి టౌన్ క్యాతాన్పల్లి మున్సిపల్ భరత్ నగర్ కాలనీ 7వ వార్డు. చెడుపై వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మంచి గెలిచిన ఈ రోజున దీపావళి పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా క్యాతంపల్లి కాలనీలో చాలా ఘనంగా జరుపుకున్నారు. కాలనీలో ప్రమిదల దీపాలు చాలా ఆకర్షణీయంగా చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. ప్రత్యేకమైన లక్ష్మీ పూజను కూడా చేసుకున్నారు. చిన్నారుల టపాసులు తారాజువ్వలతో కాలనీ అంతా వెలిగిపోయింది.