రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కులగణన సర్వేను స్వాగతిస్తున్నట్లు బీసీ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు ఒడ్డెపల్లి మనోహర్ తెలిపారు. శనివారం మంచిర్యాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కులగణన సర్వే పూర్తయ్యాక జనాభా ప్రాతిపదికన విద్యా, ఉద్యోగ, రాజకీయ, తదితర రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ వర్తింపజేయాలని కోరారు. రాష్ట్రంలో చేపట్టిన కుల గణన సర్వే దేశవ్యాప్తంగా కూడా నిర్వహించాలన్నారు.