భీమారం మండలం కొత్తపెల్లి గ్రామంలోని రెండవ వార్డులో బోర్ చెడిపోయి కొంతకాలంగా ప్రజలు నీటి సమస్యతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని గ్రామ నాయకులు అన్నముల అశోక్, నిట్టూరి సందీప్ లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు పోడేటి రవి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వారు మాజీ ఎంపీటీసీ గుండు తిరుపతికి చెప్పడంతో గురువారం రూ. 8 వేలు విలువైన స్టార్టర్, కేబుల్ వైర్ కొనుగోలు చేసి అందించారు.