దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండాల వెళ్లే రహదారి సమీపంలో రహస్యంగా జూదం ఆడుతున్న నలుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు ఎస్సై ఉదయ్ కిరణ్ పేర్కొన్నారు. మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, ఎస్సై లచ్చన్న సిబ్బందితో స్థావరంపై శుక్రవారం రాత్రి దాడి చేయడంతో నలుగురు పట్టుబడ్డారు నాలుగు సెల్ ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలు, 53, 460 నగదు స్వాధీనం చేసుకున్నారు.