మంచిర్యాల కలెక్టరేట్ లో గురువారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, బెల్లంపల్లి, ఖానాపూర్ ఎమ్మెల్యేలు వినోద్, వెడ్మ బొజ్జు, కలెక్టర్ కుమార్ దీపక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ. సందర్భంగా జిల్లాలో అభివృద్ధి పనుల పురోగతిపై సమగ్రంగా చర్చించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని ఎంపీ సూచించారు.