ఎల్లంపల్లి ప్రాజెక్టులో చేప పిల్లలు విడుదల

61பார்த்தது
మత్స్యకారులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చేపపిల్లల పంపిణీ ఆదివారం మంచిర్యాల జిల్లాలో ప్రారంభమైంది. ఇందులో భాగంగా హాజీపూర్ మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ చేప పిల్లలను విడుదల చేశారు. చేప పిల్లల పంపిణితో మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி