మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంటలో ఉన్న ఎస్టీ బాలికల వసతి గృహంలో ఆహారం వికటించి అస్వస్థతకు గురై ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను గురువారం బీజేపీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీ నాయకులు మాట్లాడుతూ పుడ్ ఫైజన్ కు కారణమైన వారికి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.