మంచిర్యాల: డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారికి వినూత్న శిక్ష
మంచిర్యాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ 27 మందికి జడ్జి గురువారం వినూత్న శిక్ష వేశారు. వారం రోజులపాటు స్థానికంగా ఉన్న మాతాశిశు సంరక్షణ కేంద్రంలో పారిశుద్ధ్య పనులు చేయాలని స్థానిక కోర్టు జడ్జి తీర్పునిచ్చారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు వారితో గురువారం పారిశుద్ధ్య పనులు చేయించారు. వారంతా గడ్డిని తొలగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.