మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం నాగుల చవితి వేడుకలను మహిళలు వైభవంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమిలో మొదటిగా వచ్చిన నాగుల చవితి సందర్భంగా మహిళలు ఉదయమే ఆలయాలకు చేరుకొని పూజలు చేశారు. హమాలివాడ, కట్ట పోచమ్మ, గౌతమి నగర్, రెడ్డి కాలనీ, హైటెక్ సిటీ రాంనగర్ లలో పెద్ద సంఖ్యలో తరలివచ్చి కొబ్బరికాయలు కొట్టి పుట్టలో పాలు పోసి దీపాలు వెలిగించారు. నాగదేవతకు నైవేద్యాలు సమర్పించారు.