పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో సఖీరా అనే మూడేళ్ల చిన్నారి స్థానిక ప్రభుత్వంపై కోర్టును ఆశ్రయించింది. లాహోర్ నగరంలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరిందని, ప్రభుత్వ వైఫల్యం వల్ల గాలి నాణ్యత అత్యంత ప్రమాదకరంగా మారిందని ఆ బాలిక పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని చిన్నారి బాలిక కోర్టుకు విజ్ఞప్తి చేసింది.