దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఉపసంహరించుకొని బీసీలకు న్యాయం చేయాలని బుధవారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టరేట్ లో ఏఓ రాజేశ్వర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. జనాభాలో 10 శాతం లేని అగ్రవర్గాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు.