రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ఆరోగ్య సమస్యలతో చనిపోయిన హోంగార్డ్స్ బి. శ్యామ్ కుమార్, బి. వెంకటేశం, కె. నగేష్, ఎం. ఏ ఫెరోజ్ ఖాన్ కుటుంబాలకు రాష్ట్ర హోం గార్డ్స్ సంక్షేమ నిధి నుండి ఒక్కొక్కరికి రూ. 15 వేలు చొప్పున మంజూరైన చెక్కులను సీపీ. ఎం. శ్రీనివాస్ గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, ఏఆర్ ఏసిపి ప్రతాప్, హోంగార్డ్స్ ఆర్ఐ మల్లేశం పాల్గొన్నారు.