కేరళలో 6 ఏళ్ల చిన్నారిని ఇంటికి తీసుకెళ్తున్న ఓ తల్లి ఒక్కసారిగా కుప్పకూలి రోడ్డుపై పడిపోయింది. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. అయితే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఎవరు సహరించకపోతే.. అటుగా వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ మానవత్వంతో దేవుడిలా ఆమెను కాపాడాడు. బస్సు ఆపి మహిళను సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఇందుకు బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా సహకరించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.