పారిపోయిన విద్యార్థిని అప్పగించిన పోలీసులు
హాస్టల్ నుంచి పారిపోయిన ఓ విద్యార్థిని బ్లూ కోల్ట్ పోలీసులు తిరిగి తీసుకొచ్చారు. ఖానాపూర్ పట్టణంలోని ఎంజేపీ పాఠశాలకు చెందిన నిక్షిత్ ఇంటి మీద బెంగతో ఆదివారం రాత్రి హాస్టల్ నుంచి పారిపోయాడు. బాలుడిని గమనించిన ఓ వ్యక్తి 100 కు సమాచారం అందించారు. బ్లూ కోల్డ్ సిబ్బంది సుధీర్ కుమార్, సంతోష్ అక్కడకు చేరుకొని బాలుని వివరాలు తెలుసుకొని హాస్టల్ సిబ్బందికి అప్పగించారు.