నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఈనెల 30న హైదరాబాదులో తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు రాజేష్ కోరారు. ఆదివారం ఖానాపూర్ పట్టణంలో ధర్నా పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని, కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని మండిపడ్డారు. జిల్లా ఉపాధ్యక్షుడు లింగన్న, తదితరులు పాల్గొన్నారు.