భారీగా కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంటాని బుధవారం ఉదయం అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695. 850 అడుగుల నీటిమట్టం ఉందని అన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 33, 729 క్యూసెక్కుల భారీ వరద నీరు వచ్చి చేరగా ప్రాజెక్టు 6 గేట్లు విప్పి 31, 382 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నట్లు తెలిపారు.