కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం పేద కుటుంబాలకు వరమని ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మా బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం జన్నారం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందని, వాటిని వినియోగించుకోవాలన్నారు. మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.