కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు మంగళవారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 690. 400 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 48,408 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు 9 గేట్లు ఓపెన్ చేసి 57,070 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నట్లు తెలిపారు.