కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో నెలకొన్న ఇరువర్గాల ఘర్షణతో ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతాల్లో గురువారం అడిషనల్ డీజీ మహేష్ భగవత్ పర్యటించారు. ఉట్నూర్ కొమరం భీమ్ కాంప్లెక్స్ లో ఆదివాసి పెద్దలతో పాటు ముస్లిం మత పెద్దలతో సమావేశమయ్యారు. ఆదివాసీ మహిళపై జరిగిన ఘటన బాధాకరమని అన్నారు. ఇప్పుడు జైనాథ్ పరిస్థితి ప్రదంతంగా ఉందని అన్నారు. ఇరువర్గాల యువకులు, ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు.