గోదావరిలో దూకిన వృద్ధురాలు.. కాపాడిన పోలీసులు

78பார்த்தது
గోదావరిలో దూకిన వృద్ధురాలు.. కాపాడిన పోలీసులు
ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్ కు చెందిన బోదాసు సాయవ్వ (70)ను జాలర్లు, పోలీసులు కాపాడారు. వృద్ధాప్యంలో కొడుకులు, కుమార్తెలు భాగోలు చూడకపోవడంతో సాయవ్వ శుక్రవారం శ్రీరాంనగర్ సమీపంలో ఉన్న గోదావరిలో దూకింది. అక్కడే ఉన్న జాలర్లు ఆమెను కాపాడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి ఆమెను పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారు. సీఐ సైదారావు కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి సాయవ్వను అప్పగించారు.

தொடர்புடைய செய்தி