బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని డీపీవో వెంకటనాయుడు చెప్పారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కొత్తపట్నం మండల కార్యాలయంలో సచివాలయ సిబ్బంది, మండల అధికారులతో ఆదివారం ఆయన సమావేశం నిర్వహించారు. డీపీవో మాట్లాడుతూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. డీపీవోతోపాటు అర్డీవో లక్ష్మీప్రసన్నలు తుఫాన్ షెల్టర్ ను పరిశీలించారు.